చిలుకూరు బాలాజీ ప్రధాన అర్చకుడిపై దాడి (Video)

ఠాగూర్

ఆదివారం, 9 ఫిబ్రవరి 2025 (21:50 IST)
తెలంగాణా రాష్ట్రంలో చిలుకూరు బాలాజీ ఆలయ ప్రధాన అర్చకులు సీఎస్ రంగరాజన్ చిలుకూరుపై ఆయన నివాసంలోనే దాడి జరిగింది. శుక్రవారం ఈ దాడి జరుగగా ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈ ప్రధాన అర్చకుడుపై ఏకంగా 20 మంది వరకు దాడి చేసిన విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
 
ఈ దాడికి పాల్పడింది రామ రాజ్యం సంస్థకుకు సంబందించిన వ్యక్తులుగా తెలుస్తుంది. ఆలయ బాధ్యతలు అప్పగించి తమ సంస్థలో చేరాలని రంగరాజన్‌ను వారు బెదిరించినట్టు సమాచారం. దీనిపై రంగరాజన్ తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశారు. 
 
దేశ వ్యాప్తంగా ఎంతో ప్రాచుర్యం పొందిన రంగరాజన్‌పై దాడిని రెండు రోజులు అవుతున్నా బయటకు రాకుండా గోప్యంగా ఉంచడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ కేసులో పోలీసులు ఒకరిని అరెస్టు చేశారు. అదేసమయంలో అసలు తెలంగాణా రాష్ట్రంలో ఏం జరుగుతుందంటూ పలువురు ప్రశ్నిస్తున్నారు. 


 

బిగ్ బ్రేకింగ్: అసలు తెలంగాణలో ఏం జరుగుతుంది?

చిలుకూరు బాలాజీ ప్రధాన అర్చకుడిపై 20 మంది దాడి.. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన సంఘటన

శుక్రవారం రోజు చిలుకూరు బాలాజీ ఆలయ ప్రధాన అర్చకులు రంగరాజన్ చిలుకూరు పై దాడి చేసిన రామ రాజ్యం సంస్ధకు సంబందించిన వ్యక్తులు

ఆలయ బాధ్యతలు అప్పగించి తమ… pic.twitter.com/MUeUQHFjOa

— Telugu Scribe (@TeluguScribe) February 9, 2025

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు