'పుష్ప-2' హీరో అల్లు అర్జున్‌పై తనకు ఏ విధమైన కోపం లేదని తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. తెలుగు చిత్రపరిశ్రమకు చెందిన అనేక మంది ప్రముఖులు గురువారం సీఎం రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రులు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డిలతో సమావేశమయ్యారు.
ఇందులో హీరో అల్లు అర్జున్ ప్రస్తావన వచ్చింది. దీనిపై సీఎం రేవంత్ రెడ్డి స్పందించారు. అల్లు అర్జున్‌పై తనకు కోపం ఎందుకుంటుందని ప్రశ్నించారు. అల్లు అర్జున్, రామ్ చరణ్ ఇద్దరూ తనకు చిన్నప్పటి నుంచి తెలుసన్నారు. వారిద్దరూ తనతో కలిసి తిరిగినవారేనని చెప్పారు.
వ్యక్తిగత అభిప్రాయాలు ఎలా ఉన్నప్పటికీ అందరూ చట్ట ప్రకారం వ్యవహరించాలనేది తన విధానమన్నారు. హాలీవుడ్, బాలీవుడ్ హైదరాబాద్‌కు చ్చేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు. సినీ పరిశ్రమకు కాంగ్రెస్ ప్రభుత్వాలు ఎంతో చేశాయని, ఆ వారసత్వాన్ని తాము కొనసాగిస్తామని తెలిపారు. ఐటీ, ఫార్మా రంగాల తరహాలోనే చిత్ర పరిశ్రమను కూడా ప్రోత్సహిస్తామని ఆయన పేర్కొన్నారు.