సీఎం రేవంత్ రెడ్డికి మరోసారి అవమానం.. పేరు మర్చిపోయిన యాంకర్ (video)

సెల్వి

శుక్రవారం, 28 ఫిబ్రవరి 2025 (15:07 IST)
Revanth Reddy
నేషనల్ సైన్స్ డేలో భాగంగా నిర్వహించిన విజ్ఞాన్ వైభవ్ ఈవెంట్లో కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ ముందు తెలంగాణ సీఎం అని సంబోధిస్తూ రేవంత్ రెడ్డి పేరును యాంకర్ మరిచిపోయారు. గచ్చిబౌలిలో తాజాగా సీఎం పాల్గొన్న కార్యక్రమంలో ఆయన పేరును యాంకర్ మర్చిపోయారు. సీఎం రేవంత్ రెడ్డికి ఇలా జరగడం ఇది రెండోసారి. జాతీయ సైన్స్​ దినోత్సవం సందర్భంగా డీఆర్​డీవో వినూత్న కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది. 
 
విజ్ఞాన్ వైభవ్-2కె25 పేరిట గచ్చిబౌలి స్టేడియంలో రక్షణ రంగ ఉత్పత్తుల ప్రదర్శన చేస్తోంది. ఈ విజ్ఞాన్ వైభవ్-2కె25ను సీఎం రేవంత్‌రెడ్డి, రక్షణమంత్రి రాజ్‌నాథ్ ప్రారంభించారు. 200 స్టాళ్లల్లో మూడు రోజుల పాటు ఈ ఎక్స్​పో కొనసాగనుంది. గచ్చిబౌలి స్టేడియంలో నిర్వహించిన పరేడ్​లో జీపుపై కేంద్రమంత్రి రాజ్​నాథ్​ సింగ్​, సీఎం రేవంత్​ రెడ్డి వెళ్లారు. అక్కడ ఉన్న చిన్నారులకు అభివాదం చేశారు. 

సీఎం రేవంత్ రెడ్డికి మరోసారి అవమానం

గచ్చిబౌలిలో తాజాగా సీఎం పాల్గొన్న కార్యక్రమంలో ఆయన పేరు మర్చిపోయిన యాంకర్

నేషనల్ సైన్స్ డే లో భాగంగా నిర్వహించిన విజ్ఞాన్ వైభవ్ ఈవెంట్లో కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ ముందు తెలంగాణ సీఎం అని సంబోధిస్తూ రేవంత్ పేరు మర్చిపోయిన… pic.twitter.com/gbhshveigW

— Telangana Awaaz (@telanganaawaaz) February 28, 2025

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు