వీల్‌చైర్‌లో సీఎం సిద్ధరామయ్య - చేయిపట్టుకుని కలియతిరిగిన రాజ్‌నాథ్ (Video)

ఠాగూర్

బుధవారం, 12 ఫిబ్రవరి 2025 (13:25 IST)
బెంగుళూరు వేదికగా "గ్లోబల్ ఇన్వెస్టర్ మీట్ : ఇన్వెస్ట్ కర్నాటక 2025" జరుగుతోంది. ఇందులో కేంద్ర రక్షణ శాఖామంత్రి రాజ్‌నాథ్ సింగ్ హాజరయ్యారు. అయితే, కర్నాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య మోకాళ్లకు ఆపరేషన్ చేయించుకున్నారు. ఆయన పూర్తిగా విశ్రాంతి తీసుకోవాలని వైద్యులు సలహా ఇచ్చారు. అయితే, సిద్ధరామయ్య మాత్రం ఇవేమీ పట్టించుకోకుండా ఈ సమ్మిట్‌కు వీల్‌చైర్‌లో హాజరయ్యారు. సీఎం సిద్ధరామయ్యను చూసిన రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ సానుభూతి చూపించారు. వీల్‌చైర్‌లో ఉన్న సిద్ధూ... రాజ్‌నాథ్‌ రాగానే లేచి నిలబడేందుకు ప్రయత్నించారు. 
 
అది గమనించిన రాజ్‌నాథ్ సింగ్ వద్దువద్దంటూ ఆపారు. ఇటీవలే సీఎం సిద్ధూ మోకాలికి ఆపరేషన్ జరిగింది. కానీ, ఆయన విశ్రాంతి తీసుకోకుండా వీల్‌‍చైర్‌‍లో ఈ సమ్మిట్‌కు రావడంపై రాజ్‌నాథ్ ప్రశ్నించారు. ఎందుకు వచ్చారంటూ అడిగారు. 
 
ఆ తర్వాత ముఖ్యమంత్రి పక్కనే కూర్చొని ఆయన ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. వీల్‌చైర్‌లో కూర్చొన్న సీఎం సిద్ధూ చేయి పట్టుకుని సమ్మిట్‌లో కలియతిరుగారు. దీనికి సంబంధించిన వీడియో ఒకటి ఇపుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా, దీన్ని చూసిన నెటిజన్లు తమదైనశైలిలో స్పందిస్తున్నారు. 



 

Heart Warming Gesture by Two leaders from different political party.

Defence Minister Rajnath Singh saw CM Siddaramaiah trying to stand and stopped him saying please be seated.

Siddaramaiah 's leg is fractured and he uses wheel chair. pic.twitter.com/3SA1OfQsFR

— ????Che_ಕೃಷ್ಣ????????????❤️ (@ChekrishnaCk) February 11, 2025

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు