కంట్లో నలక పడిందని వెళితే కాటికి పంపిన ఆసుపత్రి

ఐవీఆర్

శనివారం, 23 నవంబరు 2024 (13:23 IST)
హైదరాబాదులోని హబ్సిగూడలో వున్న ఓ కంటి ఆసుపత్రిలో దారుణం జరిగింది. కంట్లో నలక పడిందని ఐదేళ్ల చిన్నారి అన్వికను ఆనంద్ ఐ ఇనిస్టిట్యూట్ ఆసుపత్రికి తీసుకుని వెళ్లారు. వైద్య పరీక్షల అనంతరం చిన్నారికి సర్జరీ చేయాలని చెప్పారు వైద్యులు. ఈ పేరుతో ఎక్కువ మత్తు మందు ఇవ్వడంతో మందు వికటించి చిన్నారి ప్రాణాలు కోల్పోయింది. దీనితో ఆసుపత్రి ముందు బంధువుల ఆందోళనకి దిగారు.
 
మత్తు మందు అధికంగా ఇస్తే ఏమవుతుంది?
మత్తు మందు ఇవ్వాల్సిన దానికంటే అధిక మోతాదులో ఇస్తే... మెదడు దెబ్బతినడం, జ్ఞాపకశక్తి కోల్పోవడం, మాట్లాడలేకపోవడం, శారీరక బలహీనతలు లేదా ఇతర రకాల నాడీ వ్యవస్థ దెబ్బతినడానికి కారణమవుతాయి. అధిక మోతాదు అనస్థీషియా వల్ల మరణం సంభవించడం అనేది అత్యంత సాధారణమైన కారణంగా మారుతుంది..

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు