కేసీఆర్ పుట్టిన రోజు : ఫ్లెక్సీలను తొలగించండి.. (Video)

ఠాగూర్

సోమవారం, 17 ఫిబ్రవరి 2025 (10:38 IST)
భారత రాష్ట్ర సమితి అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ తన పుట్టినరోజు వేడుకలను సోమవారం (ఫిబ్రవరి 17వ తేదీ)న జరుపుకుంటున్నారు. దీన్ని పురస్కరించుకుని హైదరాబాద్ నగర వ్యాప్తంగా బీఆర్ఎస్ శ్రేణులు ఫ్లెక్సీలను ఏర్పాటుచేశారు. వీటన్నింటినీ తొలగించాలని కాంగ్రెస్ ప్రభుత్వం ఆదేశాలు జారీచేసింది. దీంతో గ్రేటర్ హైదరాబాద్ మున్సిపాలిటీ సిబ్బంది తొలగిస్తున్నారు. 
 
హైదరాబాద్ నగర వ్యాప్తంగా ఏర్పాటు చేసిన కేసీఆర్ జన్మదిన ఫ్లెక్సీలను జెండాలను తొలగించాలని ప్రత్యేకంగా ఆదేశాలు జారీ చేశారు. ఇతర పార్టీల నాయకులను ఫ్లెక్సీలను ముట్టుకోకుండా కేవలం కేసీఆర్ ఫ్లెక్సీలను మాత్రమే తీసివేయడం దారుణమని బీఆర్ఎస్ శ్రేణులు మండిపడుతున్నారు. 
 
అనేక ప్రాంతాల్లో ఫ్లెక్సీల తొలగింపును కేసీఆర్ అనుచరులు అడ్డుకుంటున్నారు. దీంతో పలు ప్రాంతాల్లో ఉద్రికత నెలకొంది. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకే తాము ఫ్లెక్సీల తొలగిస్తున్నామని, తమ విధులకు ఆటంకం కలిగించవద్దని జీహెచ్ఎంసీ సిబ్బంది భారాస శ్రేణులు, నేతలను కోరుతున్నారు.

 

బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ జన్మదినాన్ని పురస్కరించుకొని ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలను తొలగిస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం.

హైదరాబాద్ నగరంలో ఏర్పాటు చేసిన కేసీఆర్ గారి జన్మదిన ఫ్లెక్సీలను, జెండాలను తీసేయాలని ప్రత్యేకంగా ఆదేశాలు జారీ చేసిన రేవంత్ ప్రభుత్వం.

ఇతర పార్టీల,… pic.twitter.com/AlX1iKR3yQ

— BRS Party (@BRSparty) February 17, 2025

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు