తెలంగాణ ప్రజలందరికీ డిజిటల్ హెల్త్ కార్డులు : సీఎం రేవంత్ రెడ్డి

వరుణ్

గురువారం, 18 జనవరి 2024 (11:15 IST)
తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ డిజిటల్ హెల్త్ కార్డులు అందజేస్తామని తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు. దావోస్ వేదికగా జరుగుతున్న ప్రపంచ పెట్టుబడిదారుల సదస్సులో ఆయన పాల్గొన్నారు. ఇందులో హెల్త్ కేర్ డిజిటలీకరణ అనే అంశంపై ఆయన ప్రసంగించారు. డిజిటల్ హెల్త్ కార్డుల డేటా భద్రత, ప్రైవేసీని కాపాడుతామని హామీ ఇచ్చారు. 
 
ప్రభుత్వ ప్రైవేటు భాగస్వామ్యంతో అత్యాధునిక సాంకేతికత సహాయంతో నాణ్యమైన వైద్య సేవలను అందించనున్నామని ఆయన చెప్పారు. రాష్ట్ర ప్రజలందరికీ అత్యుత్తమ వైద్య సేవలు అందించాలన్నదే తమ లక్ష్యమన్నారు. రాజీవ్ ఆరోగ్యశ్రీ కింద పేదలకు రూ.10 లక్షల వరకు ఉచిత వైద్య సేవలు అందిస్తున్నామని తెలిపారు. ఇక అత్యుత్తమ వైద్య సేవలకు, సాఫ్ట్‌వేర్‌ సేవలకు హైదరాబాద్ నగరం రాజధానిగా ఉందన్నారు. ప్రపంచ వ్యాక్సిన్లు, ఔషధాల్లో 33 శాతం హైదరాబాద్ నగరంలోనే తయారవుతున్నాయని సీఎం రేవంత్ రెడ్డి తన ప్రసంగంలో పేర్కొన్నారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు