తెలంగాణలో మొదటిరోజు నిర్వహించిన గ్రూప్-1 పరీక్ష ముగిసింది. ఈ పరీక్షకు 31,383 మంది అభ్యర్థులు హాజరయ్యారు. పరీక్షలు ఈ నెల 27 వరకు కొనసాగనున్నాయి. మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పరీక్షలు జరగనుండడంతో అభ్యర్థులు ముందుగానే పరీక్షా కేంద్రాలకు చేరుకున్నారు.
అభ్యర్థుల్ని 1.30 గంటల వరకే పరీక్షా కేంద్రాల్లోకి అనుమతించారు. అయితే ఒక నిమిషం ఆలస్యంగా వచ్చిన అభ్యర్థులను గేటు బయటే ఆపేసారు. అభ్యర్థులు బాధపడుతూ చాలా కష్టపడి చదివాం సార్.. దయచేసి గేట్లు తెరవండి అంటూ ఓ ఎంత వేడుకున్నా ఫలితం లేకుండా పోయింది.
బేగంపేటలో పరీక్షకు ఆలస్యంగా వచ్చిన ఓ అభ్యర్థి లోపలికి అనుమతించకపోవడంతో.. గోడదూకి లోపలి వెళ్లాలని ప్రయత్నించగా పోలీసులు ఆమెను అదుపులోకి తీసుకున్నారు. దీంతో పరీక్ష రాసేందుకు వచ్చిన అభ్యర్థులు బాధ, నిరాశతో ఆవేదనకు గురవుతున్నారు.
గ్రూప్ 1 పరీక్షకు ఒక్క నిమిషం ఆలస్యం.. అనుమతించని అధికారులు
గేటు పట్టుకొని రోదిస్తు దయచేసి పంపించండి అంటూ వేడుకుంటున్న గ్రూప్ 1 అభ్యర్థి. pic.twitter.com/u4LgsyQ9aj