కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ విడుదల చేసిన ప్రకటనలో.. సక్రమంగా లేని పబ్లిక్ ప్రావిడెంట్ స్కీమ్, సుకన్య సమృద్ధి యోజన అకౌంట్లను క్రమబద్ధీకరించుకోవాల్సి వుంటుంది. ముఖ్యంగా ఇందులో పీపీఎఫ్ స్కీమ్‌లో.. మల్టిపుల్ అకౌంట్స్, మైనర్ అకౌంట్స్, ఎన్నారై అకౌంట్లకు సంబంధించినదిగా ఉండగా.. సుకన్య సమృద్ధి స్కీంలో అయితే గార్డియెన్‌షిప్ గురించి మార్పులొచ్చాయి.
అక్టోబర్ 1 నుంచి కొత్త రూల్స్ అమల్లోకి వస్తాయని స్పష్టం చేసింది. ఈ క్రమంలోనే అన్ని పోస్టాఫీసులు, బ్యాంకులు సహా ఇతర ఆర్థిక సంస్థలు అన్నీ సదరు అకౌంట్లు తెరిచేముందు కొత్త మార్గదర్శకాలు పాటించాలని పేర్కొంది.
పీపీఎఫ్ కొత్త మార్గదర్శకాల ప్రకారం.. ఒకటికి మించి ఒకరి పేరు మీద పీపీఎఫ్ అకౌంట్ తెరిస్తే.. అప్పుడు ప్రధాన అకౌంట్‌కు ప్రస్తుతం ఉన్న 7.10 శాతం వడ్డీ వస్తుంది. ఈ మార్పు ముఖ్య ఉద్దేశ్యం ఒకటి కంటే ఎక్కువ ఖాతాలు ఉన్నవారికి ఎలాంటి ప్రయోజనాలు అందించకపోవడం. ఇన్వెస్టర్లు వారి మొదటి అకౌంట్ నుంచి మాత్రమే ప్రయోజనం పొందగలరని పేర్కొంటుంది.
అదనంగా, ఈ ఖాతాల మెచ్యూరిటీ వ్యవధి మైనర్ మెజారిటీ సాధించిన తేదీ నుండి లెక్కిస్తుంది. దీంతో వారు ఎదిగే కొద్దీ ఆర్థిక నిర్వహణ సులభతరం అవుతుంది. వీటికి తోడు.. సుకన్య సమృద్ధి పథకంలో కూడా కీలక మార్పులు చేసింది కేంద్రం. ఈ స్కీమ్ కింద ఇంట్లో గరిష్టంగా ఇద్దరు ఆడపిల్లల పేరిటే అకౌంట్ తెరిచేందుకు వీలుంది.