ఉష్ణోగ్రతలు మెల్లమెల్లగా పెరుగుతుండడంతో హైదరాబాద్‌లో ప్రజలు వేసవికి సిద్ధమవుతున్నారు. మార్చి రెండో వారంలో వేసవికాలం ప్రారంభమవుతుందని హైదరాబాద్‌లోని భారత వాతావరణ విభాగం (ఐఎండీ) తెలిపింది. అనిశ్చిత వాతావరణం ఉన్నప్పటికీ, హైదరాబాద్‌లో ప్రజలు ఇప్పటికే వేసవి వేడిని అనుభవిస్తున్నారు.
35 డిగ్రీల సెల్సియస్ కంటే ఎక్కువ, ఉష్ణోగ్రతలు ఖచ్చితంగా ఉంటాయి. సోమవారం అత్యధికంగా జగిత్యాలలో 36.7 డిగ్రీల సెల్సియస్, జయశంకర్, కొమరం భీమ్ జిల్లాలో 36.9 డిగ్రీల సెల్సియస్ నమోదైంది.
ఈ సంవత్సరం, రాత్రిపూట ఉష్ణోగ్రతలు అరుదుగా 20 డిగ్రీల సెల్సియస్ కంటే తక్కువగా పడిపోవడంతో, నగరంలో సాధారణంగా జనవరి- ఫిబ్రవరిలో ఉన్నంత చలి వుండదు.