చెరువులోనే నాలుగు అంతస్థుల ఇల్లు.. స్కై వాక్‌లా మెట్లు.. కూల్చేశారు.. (video)

సెల్వి

గురువారం, 26 సెప్టెంబరు 2024 (15:15 IST)
Sangareddy
సంగారెడ్డి జిల్లా కొండాపూర్ మండలం మల్కాపూర్ పెద్ద చెరువులో నిర్మించిన ఓ అక్రమ కట్టడాన్ని హైడ్రా అధికారులు రెవెన్యూ సిబ్బంది, పోలీసుల సహకారంతో కూల్చేశారు. ఈ నిర్మాణం చేపట్టిన తీరు విస్మయానికి గురి చేస్తుంది. చెరువు ఒడ్డున కాకుండా ఏకంగా చెరువులోనే నాలుగు అంతస్తుల భవనం నిర్మించారు.
 
చెరువు ఒడ్డు నుంచి బిల్డింగ్ వద్దకు చేరుకోవటానికి స్కైవాక్ తరహాలో మెట్ల నిర్మాణం చేపట్టారు. నీటిలోనే పిల్లర్లు నిర్మించి జీప్లస్ 1 నుంచి నాలుగు అంతస్తుల్లో భవనం నిర్మించారు. బిల్డింగ్ కట్టిన తీరు చూసి స్థానికులు, అధికారులు విస్తుపోయారు. 
 
సికింద్రాబాద్‌ ప్రాంతానికి చెందిన ఓ కోటీశ్వరుడు దాదాపు దశాబ్ద కాలం క్రితం ఈ బిల్డింగ్ నిర్మించినట్లు అధికారులు గుర్తించారు. అయితే ఈ కూల్చివేతల్లో అపశృతి చోటుచేసుకుంది. బాంబులతో బిల్డింగ్ కూల్చేవేత పనులు చేపట్టగా.. పేలుడు ఘటనలో ఇద్దరు వ్యక్తులు గాయపడ్డారు. వెంటనే పోలీసులు వారిని ఆసుపత్రికి తరలించారు.

ఏకంగా చెరువులోనే బహుళ అంతస్తుల భవన నిర్మాణం

????సంగారెడ్డి జిల్లా మల్కాపూర్ పెద్ద చెరువు సమీపంలో ఓ వ్యక్తి మూడంతస్తుల భవనాన్ని నిర్మించాడు.
????చెరువులోని నీరు ప్రస్తుతం భవనంపైకి చేరింది.
????గ్రామస్తుల ఫిర్యాదుతో రంగంలోకి అధికారులు.
????ఎఫ్‌టిఎల్ భూభాగంలో అక్రమంగా భవనాన్ని… pic.twitter.com/npXtrqc0Dy

— Congress for Telangana (@Congress4TS) September 26, 2024

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు