ఆస్పత్రి నుంచి కేసీఆర్ డిశ్చార్జ్

శుక్రవారం, 15 డిశెంబరు 2023 (10:30 IST)
బీఆర్ఎస్ జాతీయ అధ్యక్షుడు కేసీఆర్ గత వారం యశోద ఆస్పత్రిలో తుంటి మార్పిడి శస్త్రచికిత్స చేయించుకున్నారు. వారం రోజులుగా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. కేసీఆర్ పూర్తిగా కోలుకున్నారని, ఇంటికి పంపించవచ్చని వైద్యులు నిర్ణయించడంతో శుక్రవారం డిశ్చార్జ్ చేయాలని భావిస్తున్నారు. 
 
కేసీఆర్ తన ఇంట్లో ఫిజియోథెరపీ సెషన్లను కొనసాగించనున్నారు. ఆయన పూర్తిగా కోలుకోవడానికి దాదాపు 8 వారాల సమయం పడుతుంది. కాబట్టి కేసీఆర్‌కు మరో రెండు నెలలకు పైగా రాజకీయ కార్యకలాపాలకు దూరంగా ఉండనున్నారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు