ఇటీవల వరుస వివాదాలలో ఇరుక్కుంటూ వస్తున్న మంత్రి కొండా సురేఖపై తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఒకింత సీరియస్ అయినట్లు వార్తలు వస్తున్నాయి. టాలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన నాగార్జున కుటుంబం, సమంతపై కొండా సురేఖ చేసిన వివాదాస్పద వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపిన సంగతి తెలిసిందే. ఆమె వ్యాఖ్యలపై సినిమా ఇండస్ట్రీకి చెందిన వారంతా ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఖండించారు.