హీరోయిన్ల జీవితాలతో ఆడుకున్నారు. వారి ఫోన్లు కూడా ట్యాప్ చేసింది కూడా కేటీఆరేనని కొండా సురేఖ అన్నారు. కేటీఆర్ మంత్రిగా ఉన్నప్పుడు అనేకమంది సినిమా హీరోయిన్ల జీవితాలతో ఆడుకున్నది కేటీఆర్ అని.. చాలామంది విడాకులు తీసుకోవడానికి కూడా కేటీఆర్ కారణం. మొన్నటి వరకు మంత్రి సీతక్కను ట్రోల్ చేశారు. ఇప్పుడు తనను చేస్తున్నారని మండిపడ్డారు. మహిళలంటేనే కేటీఆర్‌కు చిన్నచూపు. ఒక మహిళా మంత్రిని ట్రోల్ చేస్తే ఖండించే సంస్కారం కేటీఆర్‌కు లేదా? అని ప్రశ్నించారు.
సమంత అందుకు ఒప్పుకోలేదు. దీంతో వెళితే వెళ్లు లేదంటే లేదు అని సమంతకు విడాకులు ఇచ్చారు. దీంతో సమంత విడాకులతో వెళ్లిపోవాల్సి వచ్చిందని కొండా సురేఖ సంచలన వ్యాఖ్యలు చేశారు. కేటీఆర్‌కు డ్రగ్స్ అలవాటు ఉంది. సినిమా ఇండస్ట్రీ నుంచి చాలామంది హీరోయిన్లు త్వరగా పెళ్లి చేసుకోవడానికి కూడా కారణం కేటీఆరేనని కొండా సురేఖ అన్నారు.