కుమారీ ఆంటీ వ్యాపారానికి లైసెన్స్ లేదు, దీంతో పోలీసులు వెంటనే చర్యలు తీసుకున్నారు. సోషల్ మీడియాలో కుమారి ఆంటీ, ఆమె వ్యాపారంపై వార్తలు, మీమ్స్, రీల్స్‌తో నిండి వున్నాయి. కుమారి ఆంటీ, ఒకప్పుడు సాధారణ ఫుడ్ స్టాల్ ఓనర్. ఇప్పుడు తన ఫాలోవర్స్ వల్ల సోషల్ మీడియా సెలబ్రిటీ.
గతంలో, నిరంతరం ట్రాఫిక్ జామ్‌ల కారణంగా ఆమె స్టాల్ తొలగించబడింది. అయితే ప్రజల డిమాండ్ తర్వాత ఆమె స్టాల్ తిరిగి ప్రారంభం అయ్యింది. నిజానికి గతంలోనే సీఎం రేవంత్‌రెడ్డి ఈ విషయంలో జోక్యం చేసుకుని ఆమె స్టాల్‌ను మళ్లీ ప్రారంభించేలా చూసుకున్నారు. 2011లో కుమారి ఆంటీ 5 కేజీల బియ్యంతో మాదాపూర్‌లోని ఐటీసీ కోహినూర్ ఎదురుగా తన స్టాల్‌ను ఏర్పాటు చేసింది.
ఈరోజు మౌత్ పబ్లిసిటీ వల్ల, దూరప్రాంతాల నుంచి వచ్చే వారి వల్ల కుమారి ఆంటీ రోజుకు 100 కిలోల బియ్యంతో వ్యాపారం చేస్తోంది. ఆమె నెలకు రూ.18 లక్షలు సంపాదిస్తున్నట్లు అంచనా. ఆమె చేసే మాంసాహార వంటకాలకు భారీ డిమాండ్ వుంది. అయితే పోలీసులు వచ్చి తన వ్యాపారాన్ని మూసివేయమని చెప్పడంతో ఆమెకు పెద్ద షాక్ తగిలింది. ఆమె సోషల్ మీడియా క్రేజ్‌తో ఆమె ఆహారాన్ని రుచి చూడటానికి చాలా మంది రావడంతో ట్రాఫిక్ జామ్ అవుతోంది. దీంతో పోలీసులు చర్యలు తీసుకోక తప్పలేదు.