సీఎం రేవంత్ రెడ్డి ఫోటోని దేవుడి గదిలో పెట్టి కుమారి ఆంటీ పూజ చేస్తున్న వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. రోడ్ సైడ్ బిజినెస్ ద్వారా కుమారి ఆంటీ ఫేమస్ అయిన సంగతి తెలిసిందే. ఆమె హోటల్‌ను గతంలో తొలగించవద్దని రేవంత్ రెడ్డి ఆదేశించారు. అంతేకాకుండా అటు వైపు వెళ్లినప్పుడు ఆమె చేతి వంట రుచి చూస్తానని చెప్పడంతో మీడియా మొత్తం ఆమెను హైలెట్ చేసింది.
హైదరాబాద్ నగరంలో అత్యంత ఖరీదైన ఏరియాగా పేరున్న మదాపూర్ ఐటీసీ కోహినూర్ సమీపంలో ఆమె ఫుడ్ స్టాల్ నిర్వహిస్తుంటారు. గత రెండేళ్లుగా సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా కుమారీ ఆంటీనే దర్శనమిచ్చేది. గతేడాది సంభవించిన వరదల్లో ఖమ్మం జిల్లాల్లో అపార నష్టం వాటిల్లగా.. కుమారీ ఆంటీ సీఎం రేవంత్ రెడ్డిని కలిసి రూ.50 వేల విరాళం కూడా అందించారు.
ఇక గతంలో తన ఫుడ్ స్టాల్ తొలగించొద్దని చెప్పిన సీఎం రేవంత్ రెడ్డిపై ఆమె ప్రత్యేక అభిమానాన్ని పెంచుకున్నారు. ఆయన్ను దేవుడిగా ఆరాధిస్తున్నారు. అందుకు సంబంధించిన ఓ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
సీఎం రేవంత్ రెడ్డి ఫోటోని దేవుడి గదిలో పెట్టి పూజిస్తున్న కుమారి ఆంటీ