మెడలో పుర్రెలు ధరించి వరంగల్ బెస్తంచెరువు స్మశానంలో లేడీ అఘోరి (video)

ఐవీఆర్

మంగళవారం, 19 నవంబరు 2024 (22:41 IST)
గత కొన్ని రోజులుగా తెలుగు రాష్ట్రాల్లో కలకలం సృష్టిస్తోన్న మహిళా అఘోరీ మంగళవారం నాడు తెలంగాణ రాష్ట్రంలోని వ‌రంగ‌ల్‌లోని బెస్తం చెరువు స్మ‌శాన వాటిక‌లో కాష్టంలోని బూడిద తీసుకుని శరీరానికి పూసుకుంటూ కనిపించింది. అక్కడ ఆరిపోయిన చితిపై ప‌డుకున్నది. అనంతరం మెడలో కపాలాలు ధరించి ఏవో మంత్రాలు జపిస్తూ పూజలు చేయడం కనిపించింది.
 
లేడీ అఘోరీ స్మశానంలో చేస్తున్న పనులు తెలుసుకుని స్థానిక ప్రజలు తీవ్రమైన భ‌య‌భ్రాంతుల‌కు గురయ్యారు. అక్కడ ఆమె ఏం చేస్తున్నదన్నది తెలుసుకునేందుకు స్మ‌శానానికి భారీగా ప్రజలు చేరుకున్నారు. కాగా ఈ మహిళా అఘోరీ పదేపదే రోడ్లపైన, తెలుగు రాష్ట్రాల్లో పలుచోట్ల చేస్తున్న హంగామా దెబ్బకు బెంబేలెత్తుతున్నారు. తాజాగా ఇబ్రహీంపట్నంలో సైతం పోలీసులపైన దాడికి యత్నించి వారిని సైతం ఇబ్బందులకు గురిచేసింది.

స్మశానంలో అఘోరి హ‌ల్‌చ‌ల్‌

వ‌రంగ‌ల్‌లోని బెస్తం చెరువు స్మ‌శాన వాటిక‌లో పూజ‌లు

శ‌రీరానికి బూడిద పూసుకుని, ఆరిపోయిన చితిపై ప‌డుకున్న అఘోరి

భ‌య‌భ్రాంతుల‌కు గురైన స్థానికులు.. స్మ‌శానానికి భారీగా చేరుకున్న ప్ర‌జ‌లు#aghori #Warangal #Bigtv pic.twitter.com/u7sG3hgVoa

— BIG TV Breaking News (@bigtvtelugu) November 19, 2024

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు