పెళ్లైన రోజే.. గోడకు తలను కొట్టి.. చీరతో గొంతుకోసి భార్యను చంపేశాడు

సెల్వి

మంగళవారం, 19 నవంబరు 2024 (18:35 IST)
మిస్సైన ఒక మైనర్ బాలిక శవమై కనిపించింది. ఆమెను పెళ్లి చేసుకున్న 22 ఏళ్ల వ్యక్తితో పాటు మరో ఇద్దరిని అరెస్టు చేసినట్లు పోలీసులు మంగళవారం తెలిపారు. నిందితుడు చింటూ అలియాస్ విఘ్నేష్ ఐదు నెలల క్రితం 17 ఏళ్ల బాలికతో ఆన్‌లైన్‌లో స్నేహం చేసి నవంబర్ 8న ఆమెను వివాహం చేసుకున్నాడు. 
 
అయితే, ఆ తర్వాత అదే రోజు తమ ఇంట్లోని గోడకు తలను పగులగొట్టి, చీరతో గొంతు బిగించి హత్య చేశాడని పోలీసులు తెలిపారు. ఆ తర్వాత తన భార్య మృతదేహాన్ని అతని స్నేహితుడి సహాయంతో ద్విచక్ర వాహనంపై తరలించి, తుక్కుగూడలోని చెత్త ప్రదేశంలో పారవేసి, వ్యర్థ కాగితంతో కప్పినట్లు పోలీసు అధికారి తెలిపారు. 
 
ఒక నెల క్రితం, విఘ్నేష్ అమ్మాయిపై తన ప్రేమను వ్యక్తం చేశాడు. ఆమె అందుకు అంగీకరించింది. తదనంతరం, అతని కోసం ఇంటి నుంచి బయటికి వచ్చి అతడిని వివాహం చేసుకుంది. 
 
అయితే పెళ్లికి ముందే లైంగికంగా దాడి చేసిన వ్యక్తి.. పెళ్లి చేసుకోవాలని యువతి బెదిరించడంతో కక్ష్య కట్టుకుని పక్కా ప్లాన్‌తో హతమార్చాడు. ఈ పెళ్లి వ్యవహారం బాలిక తల్లికి ఫోనులో చెప్పింది. అయితే బాలికను హత్య చేసి మృతదేహాన్ని పడేసిన తర్వాత నిందితులు బాలిక తల్లికి ఫోన్ చేసి.. ఆమె కూతురు ఉందా అని అడిగారని పోలీసులు తెలిపారు. 
 
బాలిక తల్లికి అనుమానం వచ్చి నవంబర్ 10న మియాపూర్ పోలీస్ స్టేషన్‌లో మిస్సింగ్ ఫిర్యాదు చేసింది. ఫిర్యాదు ఆధారంగా పోలీసులు కిడ్నాప్ కేసు నమోదు చేసి విఘ్నేష్‌ను పట్టుకున్నారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు