వాయుసేన కాన్వాయ్‌పై దాడి నిజం కాదు.. బీజేప స్టంట్స్ : పంజాబ్ మాజీ సీఎం
పంజాబ్ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత చరణ్ జిత్ సింగ్ ఛన్నీ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఇటీవల జమ్మూకాశ్మీర్‌లో పూంచ్ జిల్లాలో వాయుసేన కాన్వాయ్‌పై దాడిని బీజేపీ ఎన్నికల స్టంట్‌గా అభివర్ణించారు. 'ఇవన్నీ స్టంట్స్.. టెర్రరిస్టు దాడులు కాదు. ఇవన్నీ ఎన్నికలు ముందు బీజేపీ స్టంట్లు. వీటిల్లో నిజం లేదు. ప్రజల ప్రాణాలు, దేహాలతో బీజేపీ చెలగాటమాడుతోంది' అని చరCణ్ జిత్ సింగ్ అన్నారు.