ప్రతి ఎన్నికలోనూ అనుకున్న ఫలితాలు రావనీ, ఒక్కోసారి మనం అనుకోనివి ఎదురవుతుంటాయని అన్నారు. కాంగ్రెస్ పార్టీకి ఓట్లు వేసినవారు తాము వేసిన ఓట్ల వల్ల కేసీఆర్ ప్రభుత్వం పోయిందా అంటూ తమకు సందేశాలను పంపుతున్నారని చెప్పారు. ఓటమి పాలైనంత మాత్రాన బాధపడేది ఏమీలేదనీ, కాంగ్రెస్ ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు కోసం తాము ప్రజల పక్షాన నిలబడి మాట్లాడతామని చెప్పారు.
పార్టీ పరాజయం పాలైందని ఆవేదన చెందనక్కర్లేదని, తప్పకుండా మన ప్రభుత్వం తిరిగి అధికారంలోకి వస్తుందని ధైర్యం చెప్పారు. మరోవైపు కేసీఆర్ బస చేసి వున్న ఫామ్ హౌసుకి చింతమడక ప్రజలు పెద్దఎత్తున వెళ్లి ఆయనను సందర్శించి జైకొట్టారు.