తెలంగాణ జిల్లాలకు ఎల్లో అండ్ ఆరెంజ్ అలెర్ట్.. భారీ వర్షాలకు అవకాశం

సెల్వి

బుధవారం, 9 ఏప్రియల్ 2025 (18:28 IST)
తెలంగాణలోని పలు జిల్లాల్లో నేడు, రేపు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకటించింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ విజ్ఞప్తి చేసింది. 
 
ఖమ్మం, సూర్యాపేట, భద్రాద్రి కొత్తగూడెం, హన్మకొండ, వరంగల్, ములుగు, జయశంకర్ భూపాలపల్లి, మహబూబాబాద్ జిల్లాల్లో ఈదురు గాలులు, ఉరుములు, మెరుపులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది.
 
గంటకు 40 నుండి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉన్నందున, ఈ జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేయబడింది. హైదరాబాద్ వాతావరణ కేంద్రం హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాలకు యెల్లో అలర్ట్ జారీ చేసింది. ఇక్కడ తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు