అక్రమ కేసులో అరెస్టయి జైలు నుంచి బయటకు వచ్చిన అనంతరం తొలిసారి నిజామాబాద్ పర్యటనకు బీఆర్‌ఎస్ పార్టీ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత వచ్చారు. తాను నిప్పులాంటి నిజామాబాద్ బిడ్డను... దేనికీ భయపడను అంటూ కవిత తెలిపారు. కేసీఆర్‌ను ఎదుర్కొనే ధైర్యం.. దమ్ములేక తపై, కేటీఆర్‌పై అక్రమ కేసులు పెట్టారని ఆరోపించారు. మాది భయపడే రక్తం కాదు.. భయపెట్టే రక్తమని తెలిపారు.