హైదరాబాదులో ఎండలు మండిపోతున్నాయి. 10 రోజులకు పైగా పెరిగే ఉష్ణోగ్రతలను ప్రజలు భరించలేకపోతున్నారు. అయితే ఈ ఎండల నుంచి భాగ్యనగరం ప్రజలకు ఉపశమనం కలుగనుంది. హైదరాబాద్‌తో పాటు చుట్టుపక్కల ప్రాంతాలకు తీవ్రమైన వేడి నుండి కొంత ఉపశమనం లభిస్తుంది. హైదరాబాద్‌తో సహా రాష్ట్రంలో ప్రస్తుతం ఉన్న వేడిగాలులు వచ్చే వారం నుండి తగ్గుతాయని భారత వాతావరణ విభాగం (IMD) సూచించింది.
మే 6 వరకు రాష్ట్రంలో హీట్‌వేవ్ అలర్ట్ కొనసాగుతుండగా, ఆ తర్వాత వాతావరణం చల్లబడే అవకాశం వుందని తెలుస్తోంది. మే 7 నుండి, ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం వుందని తెలుస్తోంది. మే 6నాటికే హైదరాబాదులో వర్షాల ప్రభావం వుంటుందని తెలుస్తోంది.