తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మంగళవారం హస్తినకు బయలుదేరి వెళ్లారు. ఈ పర్యటనలో ఆయన ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, మాజీ అధ్యక్షురాలు సోనియా గాంధీ, అగ్రనేత రాహుల్ గాంధీలతో పాటు పార్టీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్‌లతో ఇతర పార్టీ సీనియర్ నేతలతో సమావేశమవుతారు. వారితో భేటీ సందర్భంగా ఎమ్మెల్సీ ఎన్నికలు, నామినేటెడ్ పోస్టుల భర్తీ, మంత్రివర్గ విస్తరణ తదితర అంశాలపై ఆయన చర్చించనున్నారు.
అలాగే, వచ్చే యేడాది జరిగే పార్లమెంట్ ఎన్నికలకు పార్టీ శ్రేణులను సమాయత్తం చేసే అంశంపై కూడా చర్చిస్తారు. పీసీసీ పొలిటికల్ ఎఫైర్స్ కమిటీ తీర్మాన కాపీని పార్టీ అధ్యక్షుడు ఖర్గేతు అందించనున్నారు. ఈ పర్యటన పూర్తి చేసుకుని ఆయన తిరిగి హైదరాబాద్ నగరానికి చేరుకోనున్నారు. అయితే, ప్రధాని నరేంద్ర మోడీ అపాయింట్మెంట్ లభిస్తే మాత్రం సీఎం రేవంత్ రెడ్డి సమావేశమయ్యే అవకాశాలు ఉన్నాయని సీఎం సన్నిహిత వర్గాలు వెల్లడించాయి.