ఆరేళ్ల బాలికపై పొరుగింటి వ్యక్తి అత్యాచారం.. చాక్లెట్లు కొనిపెడతానని.. మద్యం మత్తులో?

సెల్వి

బుధవారం, 23 జులై 2025 (12:07 IST)
Crime
వయోబేధం లేకుండా మహిళలపై అఘాయిత్యాలు జరిగిపోతున్నాయి. తాజాగా హైదరాబాద్ నగర శివారులోని శంషాబాద్‌లో ఆరేళ్ల బాలికపై ఆమె పొరుగింటి వ్యక్తి అత్యాచారం చేసినట్లు ఆరోపణలు వచ్చాయి. వివరాల్లోకి వెళితే.. గుజరాత్‌కు చెందిన రోజువారీ కూలీ కార్మికుడైన నిందితుడిని ఇంకా గుర్తించలేదు. 
 
ఇంటి ముందు ఆడుకుంటున్న బాలికను చాక్లెట్లు తీసిస్తానని తీసుకెళ్లి, ఆమెను ఏకాంత ప్రదేశంలో అత్యాచారానికి పాల్పడ్డాడు. మద్యం మత్తులో వుండగా బాలికపై ఈ అఘాయిత్యానికి పాల్పడ్డాడని పోలీసులు తెలిపారు. 
 
బాలిక తల్లి బాధితురాలికి రక్తస్రావం అవుతుండటం గమనించి విచారించడంతో బాలిక జరిగిన విషయాన్ని వెల్లడించింది. బాలిక తల్లిదండ్రుల ఫిర్యాదు ఆధారంగా, ఆర్జీఐఏ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. నిందితుడిని పట్టుకోవడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. అతను పరారీలో ఉన్నాడు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు