నారాయణ కాలేజీలో ఇంటర్ విద్యార్థి ఆత్మహత్య.. పరిగెత్తించి లెక్చరర్‌పై దాడి.. (video)

సెల్వి

సోమవారం, 2 డిశెంబరు 2024 (22:47 IST)
Student
మేడ్చల్ జిల్లా అన్నోజిగూడలోని నారాయణ కాలేజీలో ఇంటర్ విద్యార్థి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. లెక్చరర్ వేధింపుల కారణంగా ఇంటర్ విద్యార్థి ఆత్మహత్యకు పాల్పడ్డాడని తల్లిదండ్రులు ఆరోపించారు. వివరాల్లోకి వెళితే... అన్నోజిగూడలోని నారాయణ కాలేజీలో ఇంటర్ విద్యార్థి సోమవారం సాయంత్రం ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఇంటర్ ఫస్టియర్ చదువుతున్న తనుష్ నాయక్ (16) బాత్రూంలో ఉరి వేసుకుని మృతి చెందాడు. 

నారాయణ కాలేజీ ప్రిన్సిపల్ పై దాడి..

రామ్ రెడ్డిని తరిమి తరిమి కొట్టిన పేరెంట్స్

లెక్చరర్ వేధింపులతో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్న తనుష్

నారాయణ కాలేజీ వద్ద ఉద్రిక్తత#Medchal #StudentSuicide #NarayanaCollege #BigTV https://t.co/IheezUiXWc pic.twitter.com/gJ9L8bEPHM

— BIG TV Breaking News (@bigtvtelugu) December 2, 2024
విషయం తెలుసుకున్న తల్లిదండ్రులు, బంధువులు అక్కడికి చేరుకుని ఆందోళనకు దిగారు. పోలీసులు అక్కడకు చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
 
ఈ ఘటనతో పేరెంట్స్, బంధువుల్లో ఆగ్రహం కట్టలు తెంచుకుంది. కాలేజీకి వెళ్లి గేట్ తాళం విరగ్గొట్టి మరీ లోపలికి వెళ్లి ఆందోళన చేశారు. మీ వేధింపుల వల్లే మా బిడ్డ ఆత్మహత్య చేసుకున్నాడంటూ ప్రిన్సిపాల్‌ను పరిగెత్తించి కొట్టారు. ఈ క్రమంలో ఉద్రిక్త పరిస్థితి తలెత్తగా.. పోలీసులు వారిని అడ్డుకుని ప్రిన్సిపాల్‌ను విడిపించారు.

లెక్చరర్ వేధింపులు.. బాత్రూంలో ఉరి వేసుకుని చనిపోయిన విద్యార్థి..

మేడ్చల్ జిల్లా అనోజిగూడ నారాయణ కాలేజీలో ఘటన

ఇంటర్ ఫస్ట్ ఇయర్ ఎంపీసీ చదువుతున్న తనుష్ (16)

లెక్చరర్ టార్చర్ చేయడం వల్లే తన కొడుకు చనిపోయాడని తండ్రి ఆరోపణ#Medchal #StudentSuicide #NarayanaCollege #BigTV pic.twitter.com/mHazhzxosP

— BIG TV Breaking News (@bigtvtelugu) December 2, 2024

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు