పక్కింటికి ఆడుకోవడానికి వెళ్తే.. అన్నయ్యతో పాటు బాలికపై ఐదుగురు సామూహిక అత్యాచారం

సెల్వి

గురువారం, 31 జులై 2025 (12:18 IST)
Crime
కామాంధులు వయోబేధం లేకుండా మహిళలపై విరుచుకుపడుతున్నారు. తాజాగా జడ్చర్లలో ఓ బాలికపై ఐదుగురు బాలురు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. వీరిలో సొంత అన్నయ్య కూడా వున్నట్లు తెలుస్తోంది. వివరాల్లోకి వెళితే.. జడ్చర్లకు చెందిన ఏడేళ్ల బాలిక ఆడుకోవడానికి పక్కింటికి వెళ్లింది. 
 
చిన్నారిపై చుట్టుపక్కల ఇళ్లకు చెందిన ఐదుగురు బాలురు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. నిందితుల్లో ఇంటర్ విద్యార్థితో పాటు నలుగురు వున్నారు. అత్యాచారానికి పాల్పడి ఏమీ తెలియనట్లు అక్కడ నుంచి జారుకున్నారు. తర్వాత బాలికకు కడుపులో నొప్పి వస్తుందని చెప్పగా.. వెంటనే తల్లిదండ్రులు ఆస్పత్రికి తరలించారు. 
 
వైద్యులు పరిశీలించి చిన్నారిపై అత్యాచారం జరిగిందని తెలిపారు. అనంతరం ఈ విషయాన్ని పోలీసులకు సమాచారం ఇచ్చారు. చిన్నారిని విచారించగా.. తాను పక్కింట్లో ఆడుకోవడానికి వెళ్లిన్నప్పుడు అన్న, స్నేహితులు కలిసి  ఏదో చేశారని చిన్నారి చెప్పింది. వైద్య పరీక్షల అనంతరం చిన్నారిని సఖి కేంద్రానికి పంపారు. 
 
మైనర్ నిందితులను అదుపులోకి తీసుకుని పోక్సో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు. ప్రస్తుతం నిందితులు పోలీసులు అదుపులో ఉన్నారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు