రేవ్ పార్టీ ఎఫెక్ట్.. మత్తుపదార్థాలు అమ్మడంపై రేవంత్ సర్కార్ సీరియస్

సెల్వి

సోమవారం, 27 మే 2024 (21:22 IST)
tobacco
తెలంగాణను మత్తుపదార్థాలు అమ్మడంపై కొరడా ఝుళిపించింది. మత్తుపదార్థాల ఫ్రీస్టేట్‌గా తెలంగాణకు మార్పు చేయడానికి అన్నిరకాల చర్యలు తీసుకొవాలని పోలీసులు, అబ్కారీ అధికారులు, విజిలెన్స్ శాఖలకు ఆదేశాలు ఇచ్చినట్లు తెలుస్తోంది.
 
ప్రజల ఆరోగ్యం, భద్రతల దృష్ట్యా గుట్కా తయారీ అమ్మకాలను నిషేధిస్తున్నట్లు రేవంత్ సర్కారు వెల్లడించింది. తెలంగాణ వ్యాప్తంగా ఎక్కడ కూడా గుట్కాలు, పాన్ మసాలాలను తయారు చేయడం, అమ్మడం వంటికి చేయకూడదంటూ ఆదేశాలు జారీ చేసింది. 
 
ఇక రేవ్ పార్టీ విషయంలో.. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి స్పందించారు. ఈ ఘటన వెనుక ఎవరు ఉన్న కూడా వదలోద్దని దర్యాప్తును వేగవంతంగా జరపాలన్నారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు