సినిమావాళ్లు షూటింగుల కోసం వచ్చినప్పుడు ఆ కండిషన్ పెట్టండి: సీఎం రేవంత్ రెడ్డి

వరుణ్

మంగళవారం, 2 జులై 2024 (14:37 IST)
తెలుగు చిత్రపరిశ్రమకు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కొన్ని ఫ్రీ కండిషన్స్ పెట్టారు. కొత్త సినిమాల విడుదల సమయంలో సినిమా టిక్కెట్ ధరలు పెంచాలని ప్రభుత్వం వద్దకు వచ్చే నిర్మాతలు... సైబర్ నేరాలు, మాదకద్రవ్యాల వినియోగం వంటి అంశాలపై యువతో అవగాహన కల్పించేందుకు ఆసక్తి చూపించడం లేదని ఆయన వాపోయారు. ఇకనుంచైనా సైబర్ క్రైమ్, డ్రగ్స్‌పై సినిమాల్లో అవగాహన కల్పించాలని ఆయన కోరారు. 
 
ఇదే అంశంపై ఆయన మాట్లాడుతూ, వందల కోట్ల బడ్జెట్ సినిమా అయినా సైబర్ క్రైమ్, డ్రగ్స్‌పై అవగాహన ప్రకటనలను సినిమాకు ముందు ప్రదర్శించాలని కోరారు. సినిమా టికెట్లు పెంచాలని ప్రభుత్వం దగ్గరకు వస్తున్నారు, కానీ వీటిపై అవగాహన కల్పించడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. డ్రగ్స్, సైబర్ నేరాలు పై సినిమాకు ముందు కానీ సినిమా తరువాత అయిన 3 నిమిషాలు వీడియోతో అవగాహన కల్పించాలి కోరారు. 
 
అలా కల్పించకపోతే వారి సినిమాలకు టికెట్లు పెంచే ప్రసక్తి లేదని స్పష్టం చేశారు. అలాంటి నిర్మాతలకు, దర్శకులకు, తారాగణంకు ప్రభుత్వం నుండి ఎలాంటి సహాయ సహకారాలు ఉండవని తేల్చి చెప్పారు. సినిమా థియేటర్లు యాజమాన్యాలు కూడా సహకరించాలని కోరారు. డ్రగ్స్, సైబర్ నేరాలపై థియేటర్లలో ప్రసారం చేయకపోతే థియేటర్లకు కూడా అనుమతి ఇవ్వబోమని స్పష్టం చేశారు. 

 

టికెట్ రేట్లు పెంచుకునేందుకు స‌ర్కార్ దగ్గ‌రికి వ‌చ్చే సినిమా ప్రొడ్యూస‌ర్ కు స‌ర్కార్ కొత్త గైడ్ లైన్

చిరంజీవి గారిలా డ్ర‌గ్స్ పై అవ‌గాహ‌న క‌ల్పించాల్సిందే

సినిమాలో ఉన్న వారితో 2నిమిషాలు స‌మాజం కోసం ఓ వీడియో చేయాల్సిందే#Revanthreddy #drugsfreebharat pic.twitter.com/va1isDw35v

— Telugu360 (@Telugu360) July 2, 2024

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు