ఆ పదవి నుంచి నన్ను తప్పించండి అని అధిష్టానాన్ని రిక్వెస్ట్ చేసానంటున్న సీఎం రేవంత్ రెడ్డి (video)

ఐవీఆర్

గురువారం, 27 జూన్ 2024 (13:39 IST)
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఏ విషయాన్నయినా ముక్కుసూటిగా చెప్పేస్తారు. ఎలాంటి దాపరికాలు అస్సలు వుండవు. ఈ రోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ... బుధవారం నాడు మా అధిష్టానం నాయకులతో భేటీ అయినట్లు చెప్పారు.
 
తనకు 2021లో పీసీసీ అధ్యక్ష పదవిని ఇచ్చారనీ, ప్రస్తుతం ఆ పదవీ కాలం ముగియబోతుందని చెప్పారు. కనుక తనను ఆ పదవి నుంచి తప్పించి సమర్థులైన వారినీ, సామాజిక న్యాయాన్ని పరిగణనలోకి తీసుకుని ఎంపిక చేయాలని చెప్పినట్లు వెల్లడించారు.
 
తను పిసీసీ అధ్యక్ష పదవి చేపట్టిన తర్వాత అసెంబ్లీ ఎన్నికలు వచ్చాయనీ, ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ఘన విజయం చేకూరిందని గుర్తు చేసారు. అలాగే పార్లమెంటు ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ పార్టీ పుంజుకున్నదని అన్నారు.

న‌న్ను త‌ప్పించండి... అధిష్టానానికి సీఎం రేవంత్ రిక్వెస్ట్#Revanthreddy pic.twitter.com/iUiYOnjLl9

— Telugu360 (@Telugu360) June 27, 2024

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు