కేసీఆర్‌ను గద్దె దించాను.. చిరకాల ధ్యేయం నెరవేరింది.. రేవంత్ రెడ్డి

సెల్వి

గురువారం, 27 జూన్ 2024 (22:33 IST)
తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌ను గద్దె దించడమే తన చిరకాల ధ్యేయమని, ముఖ్యమంత్రి కావాలన్న ఆకాంక్ష నెరవేరిందని రేవంత్‌రెడ్డి అన్నారు. ప్రస్తుతం తన దృష్టి తెలంగాణ పునర్నిర్మాణంపైనే ఉందని పేర్కొన్నారు. తాను ప్రతీకార రాజకీయాలకు పాల్పడబోనని హామీ ఇచ్చారు. లోక్‌సభలో బీఆర్‌ఎస్‌ను జీరో చేశామని, పార్టీని రద్దు చేయాలనే తన కోరిక నెరవేరిందని ఆయన పేర్కొన్నారు.
 
గురువారం ఆయన ఢిల్లీలో మీడియాతో క్యాజువల్‌గా మాట్లాడుతూ.. పీసీసీ అధ్యక్షుడిగా తన పదవీకాలం ముగిసిందని పేర్కొన్నారు. టీపీసీసీ అధ్యక్షుడిగా ఎవరిని నియమించినా వారితో కలిసి పని చేస్తానని, ఆ నియామకంపై తనకు ప్రత్యేక ప్రాధాన్యత లేదని స్పష్టం చేశారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు