సరూర్ నగర్ సమీపంలోని శారదా నగర్‌లో నివాసం ఉండే క్రాంతి - కల్పన దంపతులకు ఇద్దరు అమ్మాయిలు. పెద్ద కుమార్తెను కాకినాడకు చెందిన మల్లిఖార్జునతో నాలుగు నెలల క్రితం వివాహం జరిపించారు. సంక్రాంతికి తొలిసారి అల్లుడు రావడంతో ఆయనకు తెలియకుండా సర్‌ప్రైజ్ చేసేందుకు పిండివంటలతోపాటు మాంసాహారం, శాఖాహారం, పులిహోరా, బగారా ఇలా ఏకంగా 130 రకాల వంటలు వడ్డించి ఆశ్చర్యపరిచారు. దీనికి సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అయింది.