కేసీఆర్ ప్రభుత్వ హయాంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మేలు చేసారంటూ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆరోపించారు. ఏపీ సీఎం జగన్- కేసీఆర్ ఇద్దరి మధ్య కుదిరిన రహస్య ఒప్పందంలో భాగంగా ఏపీకి నీళ్లు దోచి పెట్టడం జరిగిందని ఆరోపించారు.
నీళ్ల వాటాను అడిగేందుకు ఆనాడు ఢిల్లీ వెళ్లిన కేసీఆర్ తెలంగాణకు రావాల్సిన వాటా కంటే 50 టిఎంసిల నీళ్లను ఏపీకి దోచిపెట్టారని అన్నారు. మొత్తం 500 టీఎంసి వాటాకి గాను ఏపీకి 550 ఇచ్చి తెలంగాణ 2 టిఎంసిల నీళ్లతో సరిపుచ్చిన ఘనత కేసీఆర్‌ది అని అన్నారు.
ఆరోజు జలదోపిడికి పాల్పడిన కేసీఆర్ ఈరోజు నీళ్లు, రైతుల సంక్షేమం అంటూ సన్నాయినొక్కులు నొక్కుతున్నారంటూ మండిపడ్డారు. కేసీఆర్ పాలనతో విసిగిపోయిన ప్రజలు కాంగ్రెస్ పార్టీకి పట్టం కట్టారని అన్నారు.