తెలంగాణాలో మారిపోతున్న వాతావరణం.. పెరిగిపోతున్న చలి తీవ్రత

బుధవారం, 13 డిశెంబరు 2023 (07:35 IST)
తెలంగాణ రాష్ట్రంలో వాతావరణ పరిస్థితులు ఒక్కసారిగా మారిపోతున్నాయి. వచ్చే మూడు రోజుల పాటు తెలంగాణాలో చలి తీవ్రత అధికంగా ఉంటుందని హైదరాబాద్ ప్రాంతీయ వాతావరణ కేంద్రం వెల్లడించింది. రాష్ట్రంలో చలితీవ్రత రోజురోజుకూ పెరుగుతుందని పేర్కంది. అయితే, రానున్న మూడు రోజుల తర్వాత చలి తీవ్ర స్థ సాధారణ స్థాయికి చేరుకోవచ్చని అంచనా వేసింది. అయితే, ఈ నెల మూడో వారం నుంచి ఈ చలి తీవ్రత మరింతగా పెరిగే అవకాశం ఉందని పేర్కొంది. రాష్ట్ర వ్యాప్తంగా చల్లటి గాలులు వీస్తాయని వెల్లడించింది. 
 
ముఖ్యంగా, రాత్రి సమయంలో ఉష్ణోగ్రత సాధారణం కంటే ఒక డిగ్రీ వరకు తక్కువగా నమోదవుతుందని తెలిపింది. హైదరాబాద్, చుట్టుపక్కల ప్రాంతాల్లో 12 నుంచి 13 డిగ్రీల మధ్య ఈ ఉష్ణోగ్రతలు నమోదు కావొచ్చని తెలిపింది. మెదక్ జిల్లాలో అత్యల్పంగా 12.5 డిగ్రీల ఉష్ణోగ్రత, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో అత్యధికంగా 18 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదవుతున్నట్టు తెలిపింది. పగటిపూట సగటున 28 నుంచి 31 డిగ్రీల ఉష్ణోగ్రత ఉంటుందని పేర్కొంది. అత్యధికంగా ఖమ్మంలో 31 డిగ్రీలు, అత్యల్పంగా హైదరాబాద్, శివారు ప్రాంతాల్లో 28 డిగ్రీల నమోదవుతుందని వెల్లడించింది. 
 
ఆధార్ కార్డు వివరాలు ఉచితంగా అప్‌డేట్ చేసుకునే గడువు ముగిసిపోయిందా?  
 
ఆధార్ కార్డులోని తప్పొప్పులతో పాటు వయసు, ఇంటి చిరునామా వంటి వివరాలను అప్‌డేట్ చేసుకునేందుకు కేంద్రం విధించిన గడువు ఈ నెల 14వ తేదీతో ముగియనుంది. ఈ నేపథ్యంలో ఈ గడువును మరోమారు పొడగించింది. గతంలో పొడిగించిన గడువు ఈ నెల 14వ తేదీతో ముగియనున్న విషయం తెల్సిందే. తాజాగా పెంచిన గడువు వచ్చే యేడాది మార్చి 14వ తేదీతో ముగియనుంది. 
 
ఈలోపు ఆధార్ వివరాలను ఉచితంగా అప్‌డేట్ చేసుకునే వెసులుబాటును కల్పించింది. ఈ గడువు ముగిసిన తర్వాత ఆధార్ వివరాలు అప్‌డేట్ చేసుకోవాలంటే నిర్ధేశిత రుసుం చెల్లించాల్సి వుంటుంది. ముఖ్యంగా ఆధార్ కార్డు పొందిన పదేళ్లు గడిచిపోయిన వారు తప్పనిసరిగా తమ డెమోగ్రఫీ వివరాలు అప్‌డేట్ చేసుకోవాల్సి వుంటుంది. 
 
భారత విశిష్ట గుర్తింపు ప్రాధికారిక సంస్థ (యూఐడీఏఐ) నిబంధనల మేరకు రేషన్ కార్డు లేదా ఓటరు గుర్తింపు  కార్డు లేదా పాస్ పోర్టు లేదా కిసాన్ ఫోటో పాస్ బుక్ లేదా టీసీ లేదా మార్కుల జాబితా లేదా పాన్ కార్డు లేదా ఈ-పాన్ లేదా డ్రైవింగ్ లైసెన్స్‌తో చిరునామా వివరాలను సమర్పించాల్సి ఉంటుంది. ఇవే కాకుండా కరెంటు బిల్లులు, టెలిఫోన్ బిల్లులు, వాటర్, గ్యాస్ బిల్లులను కూడా చిరునామా ధృవీకరణ కోసం సమర్పించవచ్చని యూఐడీఏఐ చెబుతుంది. అయితే, ఈ బిల్లులు మూడు నెలల్లోపు చెల్లించినవిగా ఉండాల్సివుంది. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు