తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఐదు రోజుల పాటు భారీ వర్షాలు

శుక్రవారం, 29 సెప్టెంబరు 2023 (14:08 IST)
తెలంగాణ ప్రజలకు వాతావరణ శాఖ శుభవార్త చెప్పింది. వచ్చే ఐదు రోజుల పాటు చాలా ప్రాంతాల్లో తేలిక పాటి వర్షాలు కురుస్తాయని పేర్కొంది. ఈ మేరకు హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. శుక్ర, శనివారాల్లో పలు ప్రాంతాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. 
 
అలాగే, వచ్చే ఐదు రోజుల పాటు ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు, కొన్ని జిల్లాల్లో అక్కడక్కడ వచ్చే అవకాశం ఉందని పేర్కొంది. గురువారం హైదరాబాద్ నగరంతో పాటు పలు ప్రాంతాల్లో వర్షాలు కురిసిన విషయం తెల్సిందే. 
 
ముఖ్యంగా, మేడ్చర్ ప్రాంతంలో క్రమక్రమంగా ప్రారంభమైన వర్షం.. ఆ తర్వాత నగర వ్యాప్తంగా విస్తరించింది. చార్మినార్, బహదూర్‌పూర్, యాకుత్‌పురా, చాంద్రాయణగుట్ట, బార్కస్, ఫలక్‌నుమా ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది. ఈ వర్షం ధాటికి అనేక ప్రాంతాల్లోని రహదారులు జలమయమయ్యాయి. వర్షం కారణంగా విద్యార్థులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. వర్షం కారణంగా పలు చోట్ల డ్రైనేజీలు పొంగిపొర్లాయి. 
 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు