అనారోగ్యంతో వీల్ చెయిర్‌కే పరిమితమైన ప్రొఫెసర్ సాయిబాబా ప్రస్తుతం నాగ్‌పూర్ జైలులో శిక్షను అనుభవిస్తున్నారు. సెషన్స్ కోర్టు తీర్పుపై ఆయన బాంబే హైకోర్టును ఆశ్రయించారు. 2022 అక్టోబరు 14 తేదీన సాయిబాబాను హైకోర్టు నిర్దోషిగా ప్రకటించి, సెషన్స్ కోర్టు తీర్పును కొట్టేసింది. అయితే, ఈ కేసులో మహారాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేయడంతో బాంబే హైకోర్టు తీర్పును అత్యున్నత న్యాయస్థానం పక్కనబెట్టి... ఈ కేసును మరోమారు లోతుగా విచారించాలని బాంబే హైకోర్టును ఆదేశించింది. దీంతో మళ్లీ విచారించిన బాంబే హైకోర్టు మంగళవారం తీర్పునిస్తూ, సాయిబాబాను నిర్దోషిగా ప్రకటించింది.