ఓ మహిళా ప్రిన్సిపాల్ విద్యార్థినిలపై బూతుల వర్షం కురిపించారు. చెప్పాపెట్టకుండా బయటకు ఎందుకు వెళ్లారే దొంగముండల్లారా అంటూ వారిని బూతులు తిట్టారు. దీనికి సంబంధించిన వీడియో ఒకటి ఇపుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. తెలంగాణ రాష్ట్రంలోని వికారాబాద్‌లోని కొత్తగడి సాంఘిక సంక్షేమ బాలికల గురుకుల పాఠశా/కాలేజీ ప్రిన్సిపాల్ ఈ పనికి పాల్పడ్డారు.
నిజానికి ఈ మహిళా ప్రిన్సిపాల్ వరుస వివాదాల్లో చిక్కుకుంటున్నారు. గత నెలలో ఈ బడిపై నుంచి బాలిక దూకిన ఘటన మరువకుముందే తాజాగా పాఠశాల ప్రిన్సిపాల్ విద్యార్థినులను బూతులు తిడుతూ, చెంప దెబ్బలు కొట్టారు. పైగా, బాలికలను దొంగ ముండల్లారా అంటూ దూషించారు. విద్యార్థినిలపై చేయి చేసుకోవడమేకాకుండా వారి తల్లిదండ్రులను కూడా ఆమె తిట్టారు.
కాగా, ఈ ప్రిన్సిపాల్ ఇలా చేయి చేసుకోవడం కొత్తేమీ కాదని, బడిలో టీచర్లు తమపై ఇష్టానుసారం చేయి చేసుకుంటున్నా, బయటకు రాకుండా జాగ్రత్తలు పడుతున్నారని విద్యార్థినిలు వాపోతున్నారు. గత నెలలో ఈ పాఠశాల భవనంపై నుంచి ఓ విద్యార్థిని కిందకు దూకిన ఘటనపై అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్.. ప్రిన్సిపాల్‌ను మందలించినప్పటికీ ఆమెతో పాటు కాలేజీ సిబ్బంది తీరు మాత్రం మారలేదు.