తమిళనాడును ముంచెత్తిన వరదలు - రైళ్లలోనే 800 మంది ప్రయాణికులు
తమిళనాడు రాష్ట్రాన్ని వరదలు ముంచెత్తాయి. మిచౌంగ్ తుఫాను కారణంగా కురిసిన భారీ వర్షాలతో చెన్నై, తిరువళ్లూరు, కాంచీపురం, చెంగల్పట్టు జిల్లాలు వరద ముంపులో చిక్కుకున్నాయి. ఇపుడు దక్షిణాది జిల్లాల్లో వరద బీభత్సం సృష్టిస్తున్నాయి. ముఖ్యంగా తిరునెల్వేలి, తూత్కుక్కుడి, కన్యాకుమారి, తెన్‌కాశి జిల్లాల్లో అతి భారీ వర్షాలు కురిశాయి.