వివరాల్లోకి వెళితే, మృతురాలిని కోల్‌కతాకు చెందిన రిసోజ్‌గా గుర్తించారు. మాదాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని స్టెర్లింగ్ పీజీ హాస్టల్‌లో నివసిస్తోంది. ఐటీ కంపెనీలో హెచ్‌ఆర్ ప్రొఫెషనల్‌గా పనిచేస్తోంది. ఈ సంఘటనకు ముందు, ఆమె ఫిబ్రవరి 3 అర్ధరాత్రి ఇన్‌స్టాగ్రామ్‌లో ఒక సందేశాన్ని పోస్ట్ చేసింది.
"నేను ఉదయం అక్కడ ఉండను... నా వస్తువులు మాత్రమే మిగిలి ఉంటాయి" అని పేర్కొంది. ఆ సందేశంతో ఆందోళన చెందిన ఆమె స్నేహితురాలు ఆమెకు తల్లిదండ్రులకు సమాచారం అందించగా, వారు ఆమెకు ఫోన్ చేయడానికి ప్రయత్నించారు. కానీ ఆమె స్పందించలేదు.
కొద్దిసేపటికే, ఆమె హాస్టల్ భవనంలోని ఆరో అంతస్థు నుండి దూకింది. సమాచారం అందుకున్న పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. ఆమె తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.