భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని, అవసరమైతే తప్ప బయటకు రావద్దని చెప్పారు. ఆకస్మికంగా వరదలు వచ్చే అవకాశాలున్నాయని, నదులను దాటేందుకు ప్రయత్నించవద్దని చెప్పారు. శిథిలావస్థలో ఉన్న ఇళ్లలో ఉన్నవారు వెంటనే ఖాళీ చేసి బంధువుల ఇళ్లకు, రెస్క్యూ క్యాంపులకు వెళ్లాలన్నారు.
ఐరోపా దేశాల్లోని టోర్నడోల మాదిరిగానే తెలంగాణలోని ములుగులోనూ పెను గాలులు వీచాయి. ములుగు జిల్లా మేడారంలోని దట్టమైన రిజర్వ్ ఫారెస్ట్ ప్రాంతంలో కురుస్తున్న భారీ వర్షాలకు పెనుగాలుల ప్రభావంతో లక్షకుపైగా చెట్లు నేలకొరిగాయి. తెలంగాణలో తొలిసారిగా అటవీ ప్రాంతంలో 500 ఎకరాల్లో చెట్లు కూలిపోవడంతో ఇంత పెద్ద విధ్వంసం చోటుచేసుకుంది.