నేను వెళ్తే వాళ్ల బాధ తప్పదు.. అందుకే వెళ్లలేదు.. పవన్

ఠాగూర్

బుధవారం, 4 సెప్టెంబరు 2024 (13:22 IST)
వరద ముంపు ప్రాంతాల్లో సహాయక చర్యలను దగ్గరుండి పర్యవేక్షిస్తున్నారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. ఆయనకు తోడుగా మంత్రులు, ఎమ్మెల్యేలు, ఉన్నతాధికారులు వరద ప్రభావిత ప్రాంతాల్లో నిత్యం పర్యటిస్తున్నారు. 
 
ఆహార పదర్థాలు, ఇతర సామాగ్రిని అందించడం చేస్తున్నారు. ఇలా ప్రత్యక్షంగా సహాయ చర్యల్లో పాల్గొంటూ సీఎం బాధితులకు మేము ఉన్నామంటూ భరోసా ఇస్తున్నారు.
 
అయితే, జనసేన అధినేత, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ మాత్రం ఎక్కడ కనిపించడం లేదు. ఇక వరద ముంపు ప్రాంతాల్లో జనసేనానిని పర్యటించకపోవడంపై నెట్టింట విమర్శలు వెల్లువెత్తాయి. 
 
తనపై వస్తున్న విమర్శలపై పవన్ స్పందించారు. తనకు బాధితుల వద్దకు వెళ్లి పరామర్శించాలని ఉందన్నారు. అయితే, తాను వెళ్లిన చోట అభిమానులు, ప్రజలు భారీ ఎత్తున తరలివస్తారని, దాంతో బాధితులకు ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉందని అన్నారు. సహాయక చర్యలకు ఆటంకం కలుగుతుందని తెలిపారు.
 
అందుకే తన పర్యటన బాధితులకు సహాయపడేలా ఉండాలే తప్పితే, ఆటంకంగా పరిణమించకూడదని నిర్ణయించుకున్నట్లు పేర్కొన్నారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు