తెలంగాణలో కరోనా కేసులు తగ్గినట్లే తగ్గి.. పెరిగిపోతున్నాయ్

శనివారం, 17 అక్టోబరు 2020 (09:38 IST)
కరోనా వైరస్ తెలుగు రాష్ట్రాల్లో తగ్గినట్లే తగ్గి వ్యాపిస్తోంది. తెలంగాణాలో కాస్త తగ్గినట్టుగా కనిపిస్తున్న కరోనా కేసులు కొద్ది రోజులుగా మళ్ళీ పెరుగుతున్నాయి. తాజాగా వైద్య ఆరోగ్య శాఖ విడుదల చేసిన బులెటిన్ ప్రకారం శుక్రవారం 1,451 కేసులు నమోదయ్యాయి. దీంతో ఇప్పటి వరకు రాష్ట్రంలో 2,20,675 కేసులు నమోదు అయ్యాయి. ఇక నిన్న కరోనాతో తొమ్మిది మంది మరణించారు. ఇప్పటివరకు 1265 మంది కరోనాతో మరణించారు.
 
ఇక తెలంగాణా రాష్ట్రంలో యాక్టివ్ కేసులు 22,774గా ఉన్నాయి. ఇక ఇప్పటి వరకు తెలంగాణాలో 1,96,636 మంది కరోనా బారిన పడి కోలుకున్నారు. నిన్న ఒక్క రోజే 1,983 మంది కరోనా నుంచి కోలుకున్నారు.
 
తెలంగాణాలో రికవరీ రేటు 89.1% శాతంగా ఉంది. ఇండియా రికవరీ రేటు 87.7% శాతంగా ఉంది. తెలంగాణాలో మరణాలు 0.57 %గా ఉన్నాయి. రాష్ట్రంలో శుక్రవారం 42,497 పరీక్షలు చేస్తే ఇప్పటి వరకు 37,89,460 పరీక్షలు చేసారు. ఇక ఎప్పటి లాగానే జీహెచ్ఎంసీ పరిధిలో భారీగా 235 కేసులు నమోదయ్యాయి.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు