ఈ దౌర్భాగ్యానికి కేసీర్ కారణం: విజయశాంతి ఫైర్

శుక్రవారం, 16 అక్టోబరు 2020 (19:32 IST)
అతి భారీ వర్షాలతో హైదరాబాదు నగరం అతలాకుతలం అయిన నేపథ్యంలో తెలంగాణ కాంగ్రెస్ నేత విజయశాంతి సీఎం కేసీఆర్ పైన ధ్వజమెత్తారు. జంట నగగరాల్లో ఈ ఏడాది ఇప్పటివరకు కురిసిన భారీ వర్షాలకు ప్రజలు ఎప్పడూ లేనంత కష్టాల్లోకి కూరుకోపోయారు. వీధుల్లో వరద నీరు కాలువల్లా పారిందని, రోడ్లపై వరదల్లా ప్రవహించిందని తెలిపారు.
 
ఈ దౌర్భాగ్యానికి పాలకులే కారణమని తెలిపారు. ప్రకృతిని నియంత్రిచడం ఎవరివల్లా కాదని, అయితే చినుకు పడితే చాలు చెదిరిపోయే జంటనగర ప్రజలను వరద కష్టాల నుంచి  రక్షించడానికి గడిచిన ఆరేళ్లుగా సీఎం కేసీఆర్ ఏం చేశారని నిలదీశారు. వారి పరిపాలనలో చిత్తశుద్ధితో ప్రజలకు సేవలు అందించి ఉంటే ఇంత నష్టం జరిగేది కాదని విమర్శించారు.
 
టీఆర్ఎస్ అధికారంలోకి రాకముందు ఎన్నెన్నో చెరువులు, దురాక్రమణలు, భూకబ్జాలు, అక్రమ నిర్మాణాలు జరిగాయని కేసీఆర్ అన్నారు. ఇప్పుడు ఏం జరిగింది. మీరైనా ఈ పరిస్థితులను సరిచేసారా... మీ తీరు ఎలా ఉన్నదో ఈ విశ్వనగరాన్ని చూస్తే చాలు అని కేసీఆర్ పైన వ్యాఖ్యానించారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు