మహిళను జుట్టు పట్టుకుని చెరకుతోటలోకి లాక్కెళ్లి అత్యాచారం

ఆదివారం, 21 ఏప్రియల్ 2019 (11:39 IST)
ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో ఓ మహిళ అత్యాచారానికి గురైంది. బాధితురాలు తన ఇంట్లో ఉండగా, కొందరు దుండగులు ఇంట్లోకి ప్రవేశించి ఆమె జుట్టుపట్టుకుని బలవంతంగా చెరకుతోటలోకి లాక్కెళ్ళి అత్యాచారం జరిపారు. ఈ దారుణం శనివారం జరిగింది. 
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, ముజఫర్‌నగర్‌ నగరంలోని జబేపూర్‌ గ్రామానికి చెందిన మహిళ(23) ఇంట్లో ఉండగా.. శనివారం గుర్తుతెలియని నలుగురు దుండగులు ఆమె ఇంట్లోకి బలవంతంగా ప్రవేశించారు. ఆ తర్వాత ఆమెను పుర్కాజీ  పోలీసు స్టేషన్‌ సమీపంలో ఉన్న చెరుకు తోటలోకి తీసుకెళ్లి సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. 
 
ఈ విషయాన్ని బయట చెబితే చంపేస్తామని బెదిరించి మహిళను వదిలేశారు. ఇంటికెళ్లిన మహిళ జరిగిన విషయంలో కుటుంబ సభ్యులకు తెలిపగా.. వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టామని పుర్కాజీ పోలీసులు తెలిపారు. పరారీలో ఉన్న దుండగుల కోసం పోలీసులు గాలిస్తున్నారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు