వరంగల్ జిల్లా మహబూబాబాద్, ములుగు జిల్లాల్లో ఈ ఆందోళన తారాస్థాయికి చేరాయి. మరికొన్ని ప్రాంతాల్లో గత రెండు రోజులుగా ఆందోళనలు జరుగుతున్నాయి. ములుగు జిల్లా తాడ్వాయి మండలం మేడారంలోనూ ఈ ఆందోళన జరుగుతున్నాయి.
సమ్మక్క, సారలమ్మలపై చిన్నజీయర్ స్వామి చేసిన వ్యాఖ్యలను తక్షణం వెనక్కి తీసుకోవాలని, లేనిపక్షంలో ఆయనకు వ్యతిరేకంగా వివిధ రకాలైన ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తామంటూ సమ్మక్క సారలమ్మ భక్తులు హెచ్చరిస్తున్నారు.