తెలంగాణా ప్రజలకు హెచ్చరిక - అప్రమత్తంగా ఉండాలి...

గురువారం, 17 మార్చి 2022 (08:16 IST)
తెలంగాణ రాష్ట్ర ప్రజలకు వాతావరణ శాఖ హెచ్చరించింది. గత కొన్ని రోజులుగా పగటి ఉష్ణోగ్రతలు రికార్డు స్థాయిలో నమోదవుతున్నాయి. ఇవి సాధారణం కంటే 6-7 డీగ్రీలు అదనంగా నమోదవుతున్నాయి. దీంతో వడగాలులు కూడా ఎక్కువైపోతున్నాయి. రాష్ట్రంలో నేడు, రేపు వడగాలులు వీచే ప్రమాదం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. అందువల్ల ప్రజలు మరింత అప్రమత్తంగా ఉండాలని సూచన చేసింది. 
 
నల్గొండ జిల్లాలో బుధవారం సాధారణం కంటే 5 డిగ్రీలు అధికంగా నమోదైంది. 42.4 డిగ్రీల ఉష్ణోగ్రత నమోంది. గత పదేళ్లలో నల్గొండలో మార్చి నెలలో నమోదైన అత్యధికంగా పగటి ఉష్ణోగ్రత. అంతకుముందు 2016లో మార్చి 23న డిగ్రీల నమోదైంది. 
 
ఆదిలాబాద్, రామగుండం, నిజామాబాద్, పెద్దపల్లి, భద్రాచలం, మెదక్ తదిత ప్రాంతాల్లోనూ బుధవారం 40 డిగ్రీలకుపైగా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఇవి మరింతగా పెరిగే అవకాశం ఉందని, అందువల్ల ప్రజలు మరింత అప్రమత్తంగా ఉండాలని అధికారులు కోరారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు