కాగా.. నిరుద్యోగి ఆత్మహత్య విషయం తెలుసుకున్న అధికార టీఆర్ఎస్ పార్టీ నేతలు రంగంలోకి దిగారు. నిరుద్యోగి ఆత్మహత్య చేసుకున్న విషయం బయటకు పొక్కకుండా విశ్వప్రయత్నాలు చేస్తున్నారు. పోలీసులు హుటాహుటిన గ్రామానికి చేరుకొని.. పంచనామా నిర్వహించారు. వైద్య సిబ్బందిని కూడా అక్కడికే పిలిపించి పోస్టుమార్టం నిర్వహించారు.
సాధారణంగా ఎవరైనా చనిపోతే డెడ్ బాడీని తీసుకుని ఆస్పత్రికి వెళ్లినా గంటల తరబడి జాప్యం చేసే వైద్యులు, పోలీసులు గంటల్లోనే నిరుద్యోగి గ్రామానికి వెళ్లి పంచనామా, పోస్టుమార్టం నిర్వహించడం చర్చనీయాంశంగా మారింది. నిరుద్యోగి ఆత్మహత్య విషయం బయటకు పొక్కితే ప్రభుత్వ పరువుకు భంగం కలుగుతుందనే ఉద్దేశ్యంతో గోప్యంగా ఉంచుతున్నారనే ఆరోపణలు వస్తున్నాయి.