ఆకాశంలోనే విమానంలో మంటలు... పైలెట్ ఏంచేశాడు?

బుధవారం, 28 నవంబరు 2018 (15:02 IST)
యాదాద్రి జిల్లా యాదగిరిగుట్ట మండలం బహుపేట గ్రామ సమీపంలో మరోసారి ఆర్మీ ట్రైని విమానానికి ఆకాశంలోనే మంటలు అంటుకున్నాయి. దానితో ఆ విమానం కాలుతూ ఆకాశం నుంచి కూలిపోయింది. కిందపడి కాలి బూడిదైంది.
 
ఐతే అందులో వున్న పైలెట్ అత్యంత చాకచక్యంగా ప్యారాచూట్ సాయంతో బయటకు దూకేశాడు. పైలెట్ ఉత్తర ప్రదేశ్‌కు చెందిన యోగేశ్ యాదవ్‌గా గుర్తించారు. అతడికి తీవ్ర గాయాలయ్యాయి. విషయం తెలుసుకున్న ఆర్మీ సిబ్బంది హుటాహుటిన ఘటన స్థలానికి హెలికాఫ్టర్లో చేరుకున్నారు. ప్రధమ చికిత్స చేసి ఆసుపత్రికి తరలించారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు