బీజేపీ కావాలనే ఆ పని చేయిస్తోంది.. అసదుద్ధీన్ ఓవైసీ

సోమవారం, 6 జూన్ 2022 (20:19 IST)
భారత్‌లో ముస్లింల పట్ల ప్రదర్శిస్తోన్న వైఖరి సరికాదంటూ ఆర్గనైజేషన్ ఆఫ్ ఇస్లామిక్ కోఆపరేషన్ (ఓఐసీ) జనరల్ సెక్రటేరియట్ చేసిన ప్రకటనను భారత్ ఖండించిన విషయంపై అసదుద్ధీన్ ఓవైసీ స్పందించారు. 
 
మహమ్మద్ ప్రవక్తపై బీజేపీ నాయకురాలు నురూప్ శర్మతో పాటు ఆ పార్టీకి చెందిన నవీన్ కుమార్‌ జిందాల్‌ అనుచిత వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో ఓఐసీ చేసిన ప్రకటనపై స్పందించిన కేంద్ర ప్రభుత్వం 20 కోట్ల ముస్లింల ఆందోళన గురించి మాత్రం ఎందుకు స్పందించలేదని అసదుద్దీన్ నిలదీశారు.
 
అరబ్ ప్రపంచం ముందు భారత్ అపఖ్యాతి పాలైంది. భారత విదేశాంగ విధానం నాశనమైంది. నుపూర్ శర్మను అరెస్టు చేయాలని డిమాండ్ చేస్తున్నానని చెప్పారు. బీజేపీ కేవలం సస్పెన్షన్ వేటు వేసి వదిలేయడం సరికాదని తెలిపారు. 
 
అలాగే, భారత విదేశాంగ శాఖ ఏమైనా బీజేపీలో భాగమైపోయి పనిచేస్తుందా? ఒకవేళ గల్ఫ్ దేశాల్లో భారతీయులపై విద్వేషపూరిత నేరాలు, హింస చెలరేగితే ఏం చేస్తారు? బీజేపీ ఉద్దేశపూర్వకంగానే తమ నేతలతో అనుచిత వ్యాఖ్యలు చేయిస్తుందని ఫైర్ అయ్యారు. అంతర్జాతీయ సమాజం నుంచి విమర్శలు వస్తేనే తమ నేతలపై పార్టీ పరంగా చర్యలు తీసుకుంటుందని అసదుద్దీన్ చెప్పారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు