అలాగే కడప జిల్లాలోని బద్వేల్ నియోజకవర్గానికి జరిగిన ఉప ఎన్నిక కౌంటింకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు ఎన్నికల అధికారి కేతన్ గార్గ్ వెల్లడించారు. 2021, అక్టోబర్ 30వ తేదీన ఎన్నికలు జరిగిన సంగతి తెలిసిందే.
281 పోలింగ్ కేంద్రాలకు ఒకే చోట కౌంటింగ్‌కు ఏర్పాట్లు చేయడం జరిగిందని, కౌంటింగ్ హాల్స్ కూడా ఏర్పాటు చేశామన్నారు. నాలుగు హాళ్లలో 28 టేబుల్స్ ఏర్పాటు చేసి ఈవీఎంలో నిక్షిప్తమైన ఓట్లను లెక్కించడం జరుగుతుందని, కొన్ని టేబుళ్లు పెరిగే అవకాశం ఉందనే అభిప్రాయం వ్యక్తం చేశారు.